Sunday 5 October 2014

నిజమా! మా కలలు ఏంటి?

ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కంటాడు.  

అవి సాకారం చేసుకోడానికి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే కృషి చేస్తారు. 

అలా కృషి చేసినవారే విజయం సాధించి మంచి జీవితాన్ని గడుపుతారు. 

అలా కృషి చేసిన వారి జీవితాల గురించి ఇక్కడ చెప్పుకోడానికే ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నా.

ప్రతి రోజు ఎందరో వారి జీవన బృతి కోసం ఎన్నో పనులు చేసుకుంటూ సంపాదిస్తుంటారు. 

అందరిలా మనం కూడా ఒకడిగా వుండిపోవడం వల్ల మన కలలు సాకారం కావు. 

మనకున్న జీవిత ధ్యేయం మీద దృష్టి పెట్టి దానిని సాధించడానికి కృషి చేసినప్పుడే సాకారం చేసుకో గలం. 

ఉదాహరణకి మనం సమయపాలనకి ఎంత విలువ ఇస్తున్నామో తెలుసుకోవాలి. ఇది చదవండి.

ఖజానా

ఊహించుకోండి ప్రతి రోజూ మీ ఖాతాలో రూ.86,400/- జమ అవుతున్నాయి, వాటిని ఏరోజు జమ ఆరోజు మాత్రమే ఖర్చు చేయాలి మరుసటి రోజుకు నిల్వ ఉంచకూడదు, ఆ రోజుకు సాయంత్రానికి ఎంత నిల్వ ఉందో ఆ మొత్తం వెనక్కి పోతుంది అన్నారనుకోండి. అప్పుడు మీరు ఏమిచేస్తారు? ప్రతి పైసా తప్పనిసరిగా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తారుగా?


          ఖచ్చితంగా ప్రయత్నిస్తారనుకోండి. అలాటి ఖాజానా మనందరికీ ఉంది.. అదే మన సమయం. మనకు ప్రతి రోజు ఉదయం 86,400 సేకన్లు జమ అవుతాయి.  ఆ రాత్రికి అవి వెనక్కి పోతాయి, ఎంత సమయం మనం మంచి పనులకోసం ఖర్చు చేయగలిగామో అదే మనం పొందిన రొక్కం మిగిలినది వెనక్కి పోయినట్టే. ఆ సమయాన్ని మనం దాచుకోలేము, మనకున్నదానికన్న ఎక్కువ పొందలేము. ప్రతి ఉదయం కొత్తగా మీ ఖాతాలోకి అంతే సమయం వస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి మరలా ఆ రోజు వృద్ధాచేసినదంతా కాలిపోతుంది. నువ్వు ఏ రోజు జమ అయిన సమయం ఆ రోజు మంచి కోసం ఖర్చు చేయడంలో విఫలమైతే ఆ నష్టం నీదే. మరలా తిరిగిరాదు. రేపు నువు వాడుకోలేవు. కాబట్టి, ఎప్పటికీ కూడా సరిపడా సమయం ఉండదు, ఎక్కువ సమయం రాదు. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో మనకు మనము గా నిర్ణయించుకోవాలి తప్ప వేరొకరు కాదు. మనం ఏమి చేయాలనుకున్న ఎప్పటికీ మనకు సమయం సరిపోదు, కానీ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసేయడమే.


No comments:

Post a Comment